Central Cabinet: పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్ర క్యాబినెట్..! 2 d ago

featured-image

వ్యవసాయానికి కీలకమైన అమోనియం ఫాస్ఫేట్' (DIAMMONIUM PHOSPHATE-DAP) ఎరువుపై అదనపు రాయితీ కింద రూ.3,850 కోట్ల వరకు వ‌న్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దీని ప్రకారం రైతులకు 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350కే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరించనుంది. జనవరి 01, 2025 నుంచి ఇది మొదలై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అమల్లో ఉంటుంది. ఇదివరకు ప్రకటించిన రూ.2,625 కోట్ల రాయితీ డిసెంబర్ 31, 2024 తో ముగిసింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్ బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్ డబ్ల్యూబీసీఐఎస్) అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కూడా క్యాబినెట్ అంగీకరించింది. దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సర మధ్యకాలానికి కేటాయింపును రూ.69,515.71 కోట్లకు పెంచింది. ఇదివరకు 2020-21 నుంచి 24-25 మధ్య కాలానికి రూ. 66,550 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుచేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది.

నవకల్పనలు, సాంకేతిక నిధి..

పంటల బీమా పథకం అమలులో పారదర్శకత పెంచి క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు 824.77 (ఫండ్ ఫ‌ర్ ఇన్నోవేష‌న్ అండ్ టెక్నాల‌జీ-ఎఫ్ఐఎటీ) ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా కొత్త సాంకేతిక అంశాలను జోడించడంతోపాటు, పరిశోధన, అభివృద్ధి అధ్యయనాలు చేపడతారు. పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి 'సాంకేతికత వాడుకతో దిగుబడి అంచనావేసే వ్యవస్థ' (యీల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ.. ఎస్-టెక్) ద్వారా రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్, అస్సాం, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలు ఉపయోగిస్తున్నాయి. త్వరగా మిగతా రాష్ట్రాలనూ దీని పరిధిలోకి తీసుకొస్తారు.

వాతావరణ సమాచారం, గణాంకాల వ్యవస్థ...

మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ వర్షమానినిల ఏర్పాటు కోసం 'వాతావరణ సమాచారం, గణాంకాల వ్యవస్థ' (వెద‌ర్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ అండ్ నెట్‌వ‌ర్క్ డేటా సిస్ట‌మ్‌-విండ్స్‌)ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల స్థానిక వాతావరణ వివరాల సేకరణ వేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం దీనిని అమలుచేసే దిశగా కేరళ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో చర్యలు తీసుకుంటున్నాయి. వేగంగా ఈ సాంకేతికతను అందిపుచ్చుకొనేలా మిగిలిన రాష్ట్రాలనూ ప్రోత్సహిస్తారు. 2024-25లో ఈ విధానాన్ని అమలుచేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వనుంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD